ఐపీఎల్‌లో గౌరవం దక్కలేదు.. అందుకే దూరంగా ఉన్నా: క్రిస్ గేల్

ఐపీఎల్‌ పై క్రిస్‌ గేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని ఐపీఎల్‌ సీజన్లలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని పేర్కొన్నారు గేల్‌. దీంతో ఈ సీజన్‌ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. గత సీజన్‌ లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున 10 మ్యాచ్‌ లు మాత్రమే ఆడిన గేల్‌.. బయోబబుల్‌ కారణంగా లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు గేల్‌.

అయితే.. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లు గా ఐపీఎల్‌ లో తనకు సరైన గౌరవం దక్కలేదని అనిపించిందని..ఇన్నేళ్లు క్రికెట్‌ ఆడి ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత నీకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కలేదురా గేల్‌.. అని నా మనసుతో నేనే అనుకున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే మెగా వేలానికి ముందు రిటెన్షన్‌ ప్రక్రియలో నా పేరు లేనప్పుడు కూడా పెద్దగా బాధపడలేదు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని నేను ముందే ఊహించా. క్రికెట్‌ తర్వాత చాలా జీవితం ఉందది. దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నానని గేల్‌ అన్నారు. తాజాగా గేల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.