వాట్సాప్‌కు మదర్స్ డే స్టిక్కర్స్ ని ఇలా ఈజీగా యాడ్ చేసుకుని.. సెండ్ చేసుకోండి..!

-

అమ్మ చూపించే అంత ప్రేమ మనం ఎక్కడ పొందలేము. అమ్మ చేసే త్యాగం, పడే శ్రమ ఎవరు చేయలేరు, పడలేరు. అలాంటి మాతృమూర్తులకు ధన్యవాదాలు చెప్పుకునేందుకు ప్రతీ సంవత్సరం మే రెండో ఆదివారం రోజున మదర్స్ డే ని జరుపుకుంటూ ఉంటాం. ప్రతీ ఏడాది కూడా మదర్స్ డే మే రెండో ఆదివారం రోజున జరుపుకుంటూ ఉంటాము.

ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజున తల్లి కి వాళ్ళ యొక్క ప్రేమని చూపిస్తారు. అయితే ఇది వరకు చూస్తే గ్రీటింగ్ కార్డ్స్ మొదలైన వాటి ద్వారా ప్రేమని తెలిపేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరగడంతో టెక్స్ట్, ఫొటోల రూపంలోనే చెబుతున్నారు.

అలానే కొత్తగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ద్వారా స్టిక్కర్ల రూపంలోనూ ఆకర్షణీయంగా మదర్స్ డే విషెస్ చెప్పవచ్చు. మీరు కూడా అలా విషెస్ చెప్పాలంటే ఈ విధంగా ఫాలో అయ్యిపోండి. మరి వాట్సాప్‌కు మదర్స్ డే స్టిక్కర్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి…?, ఎలా సెండ్ చెయ్యాలి అనేది చూసేద్దాం.

ముందు మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి సెర్చ్ బార్‌లో మదర్స్ డే వాట్సాప్‌ స్టిక్కర్స్ అని టైప్ చేయండి.
కింద మదర్స్ డే స్టిక్కర్స్‌కు సంబంధించిన యాప్స్ ఉంటాయి. నచ్చిన సిక్కర్స్ యాప్స్‌లో ఇష్టమైన దానిపై ట్యాప్ చేయండి.
నెక్స్ట్ మీరు ఇన్‌స్టాల్ చేసి, ఓపెన్ చేయండి.
యాప్ ని ఓపెన్ చేసాక మదర్స్ డే సిక్కర్ ప్యాక్స్ అని ఉంటాయి.
ఇష్టమైన స్టిక్కర్స్‌పై ట్యాప్ చేస్తే యాడ్ టూ వాట్సాప్‌ అని వస్తుంది.
దానిపై క్లిక్ చేయండి.
మీ వాట్సాప్‌కు అవి యాడ్ అవుతాయి.
అప్పుడు మీ అమ్మ గారి చాట్ ఓపెన్ చేసి స్టిక్సర్స్ సెక్షన్‌పై ట్యాప్ చేయండి.
ఇక్కడ మీకు నచ్చిన స్టైకెర్స్ ని సెండ్ చెయ్యండి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news