అతడు టీమ్ లో ఉంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచేది.. షేన్ వాట్సన్.

2019వరల్డ్ కప్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో ఓడిపోయి వరల్డ్ కప్ నుండి ఇండియా టీమ్ వైదొలగింది. అయితే ఇండియా టీమ్ లో అంబటి రాయుడు ఆటగాడిగా ఉండుంటే 2019 ప్రపంచ కప్ ఇండియా వశమై ఉండేదని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ చెబుతున్నాడు. ఐపీఎల్ 13 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న షేన్ వాట్సన్, ఈ విధంగా స్పందించాడు. ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచులో అంబటిరాయుడు ముంబై ఇండియన్స్ పై విజృంభించిన సంగతి తెలిసిందే.

48బంతుల్లో 71 పరుగులు తీసిన అంబటి రాయుడు చెన్నైని విజయతీరాలకు తీర్చాడు. ఈ నేపథ్యంలో షేన్ వాట్సన్, అంబటి రాయుడుపై ప్రశంసలు కురిపించాడు. మిడిల్ ఆర్డర్ లో అంబటి రాయుడు ఉండుంటే వరల్డ్ కప్ మిస్ అయ్యుండేది కాదని అంటున్నాడు. వరల్డ్ కప్ మ్యాచులకి అంబటి రాయుడు సెలెక్ట్ కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంబటి రాయుడు అంతర్జాతీయ మ్యాచులకి రిటైర్ మెంట్ ప్రకటించాడు.