ఐపీఎల్ 2022 : ఆట‌గాళ్ల ఎంపికపై కొత్త జ‌ట్ల‌కు డెడ్ లైన్

రాబోయే ఏడాది జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ లో కొత్త‌గా రెండు జ‌ట్లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే కొత్త ఫ్రొంచైంజీలు ల‌క్నో, అహ్మ‌దాబాద్ జ‌ట్లు ఐపీఎల్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే రిటేన్ష‌న్ ప్ర‌క్రియా ముగిసింది. అయితే కొత్త ఫ్రొంచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అయితే గ‌తంలో జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు కొత్త ఫ్రొంచైజ్ లు ఆట‌గాళ్ల ఎంపికకు టైమ్ ఉండేది. కానీ తాజా గా బీసీసీఐ ఆట‌గాళ్ల ఎంపికకు కొత్త ఫ్రొంచైజ్ ల‌కు కొత్త డెడ్ లైన్ విధించింది.

ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొత్త ఫ్రొంచైజ్ లు ఎంపిక చేసుకోవాల్సిన ముగ్గురు ఆట‌గాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని ప్ర‌క‌టించింది. ఈ ముగ్గురు ఆట‌గాళ్లల్లో ఇద్ద‌రు స్వ‌దేశీ ఆట‌గాళ్లు, ఒక్క విదేశీ ఆట‌గాడు ఉండాలని బీసీసీఐ తెలిపింది. దీనికి సంబంధించి స‌మాచారాన్ని కూడా కొత్త ఫ్రొంచైజ్ లకు ఈ రోజు మ‌ధ్యాహ్నం ఇచ్చామ‌ని బీసీసీఐ తెలిపింది. కాగ ఆట‌గాళ్ల ఎంపిక కోసం లక్నో, అహ్మ‌దాబాద్ జ‌ట్లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. అహ్మ‌దాబాద్ జ‌ట్టుకు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్య అని.. ల‌క్నో జ‌ట్టుకు కెప్టెన్ గా కెఎల్ రాహుల్ ను ఎంపిక చేసిన‌ట్లు వార్తలు కూడా వ‌స్తున్నాయి. కాగ మెగా వేలం వ‌చ్చే నెల 12, 13 తేదీల‌లో ఉంటుంద‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది.