టీడీపీ వర్సెస్ జనసేన: ‘సీఎం’ పంచాయితీ తేలేలా లేదు…!

ఏపీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. అధికార వైసీపీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ ప్రతిరోజూ వైసీపీని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అటు జనసేన, కాంగ్రెస్, బీజేపీలు సైతం వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. అంటే ప్రతిపక్షాలు మొత్తం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదే క్రమంలో ప్రతిపక్షాలు ఏకమైతే ఇంకా వైసీపీకి చెక్ పెట్టొచ్చనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కుదురుతుందని ప్రచారం జరుగుతుంది.

tdp-janasena
tdp-janasena

ఇటు చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్‌ని కలుపుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. కానీ పవన్ మాత్రం బాబుతో కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది. పొత్తు విషయంలో పవన్ ముందుకు రావడం లేదని ఇటీవల చంద్రబాబు మాటల్లో అర్ధమైంది. ఇదే సమయంలో చంద్రబాబు మాటలపై జనసేన నేతలు కూడా స్పందిస్తూ…పొత్తు పెట్టుకోవాలంటే పవన్ కల్యాణ్‌కు సీఎం సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్‌కు సీఎం సీటు ఇస్తామంటే పొత్తు పెట్టుకుంటామని జనసేన నేతలు మాట్లాడుతున్నారు.

అయితే జనసేన నేతలు అడుగుతున్నట్లు పవన్‌కు సీఎం సీటు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటారా? అసలు టీడీపీ శ్రేణులు అంగీకరిస్తాయా? అంటే అబ్బే అసలు ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ఇందులో వేరే ఆలోచన కూడా లేదు. టీడీపీ శ్రేణులు కూడా అదే చెబుతున్నాయి. అసలు జనసేన సింగిల్‌గా పోటీ చేస్తే ఎలాగో పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్ధి కదా…పైగా బీజేపీ సపోర్ట్ ఎలాగో ఉంది..కాబట్టి పవన్ సీఎం అయిపోవచ్చని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి.

జనసేన-బీజేపీలు పోటీ చేసి అధికారంలోకి వస్తే పవన్ సీఎం అవుతారు కదా…అలాగే పోటీ చేసి అవ్వండి అని టీడీపీ శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కనీసం 10 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమని విశ్లేషణలు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు సీఎం సీటు ఎలా ఇస్తారని టీడీపీ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి టీడీపీ-జనసేనల మధ్య సీఎం సీటు విషయంలో పంచాయితీ నడుస్తోంది.