ఈడెన్ గార్డెన్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఎదురీదుతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో కోల్కతా బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి పవర్ ప్లే లోనే పంజాబ్ కీలక ప్లేయర్లు అయిన ప్రభు సిమ్రాన్ సింగ్ (12) , రాజపక్స (0) మరియు లివింగ్ స్టన్ (15) ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముఖ్యంగా కోల్కతా బౌలర్ హర్షిత్ రానా అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లను తీసుకున్నాడు. ఇక గత మ్యాచ్ లో పంజాబ్ తరపున ఎక్కువ స్కోర్ చేసిన లివింగ్ స్టన్ వికెట్ ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సాధించి పంజాబ్ కు సూపర్ షాక్ ఇచ్చాడు. ఇక ఈ షాక్ నుండి పంజాబ్ బయటపడలాంటే మరి కొన్ని ఓవర్ ల వరకు నిదానంగా ఆడాల్సి ఉంది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం చాలా ఓపికగా ఆడుతున్నాడు. వీరిద్దరూ మరో 5 ఓవర్లు కనుక ఆడితే 180 పరుగులు సాధించే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఇకపై పంజాబ్ ఎలా ఆడుతుందో ?