హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కింది. 2020 అండర్ – 19 క్రికెట్ వరల్డ్ కప్ తో ఫేమస్ అయిన తిలక్ వర్మను ఈ మెగా వేలంలో మోస్ట్ సక్సస్ ఫుల్ ఫ్రొంఛైజీ ముంబాయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా పోటీ పడగా.. ముంబాయి ఇండియన్స్ ఏకంగా రూ. 1.70 కోట్లకు దక్కించుకుంది. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ తో బరిలోకి దిగిని తిలక్ వర్మ కు రూ. 1.70 కోట్లు దక్కడం విశేషం.
అలాగే హైదరాబాద్ కు చెందిన సీపీ సీవీ ఆనంద్ కుమారుడు మిలింద్ ఆనంద్ కు కూడా ఈ మెగా వేలంలో చోటు దక్కింది. మిలింద్ ఆనంద్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ తో మిలింద్ ఆనంద్ వేలం ప్రారంభం అయింది. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రొంఛైజీ బేస్ ప్రైజ్ కు బిడ్ వేసింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ రూ. 25 లక్షలకు మిలింద్ ఆనంద్ ను దక్కించుకుంది.