ఐపీఎల్ 2020 విజయవంతం అయినందుకు క్రీడాకారులు, ఫ్రాంచైజీలు, బీసీసీఐ అధికారులందరికీ బోర్డ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఖాళీ స్టేడియాలలో టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ప్రపంచానికి క్రీడలు చాలా అవసరం అని గంగూలీ అన్నాడు. ప్రపంచం సాధారణ స్థితికి రావడం అనేది మన జీవితానికి చాలా అవసరం అని అతను చెప్పాడు.
మొత్తం బిసిసిఐ బృందం, ఆఫీసు-బేరర్లు మాత్రమే కాదు, మైదానంలో పనిచేసే ఉద్యోగులు మరియు సిబ్బంది, వారు గత రెండున్నర నెలలుగా దుబాయ్‌లో ఉన్నారని… ఫైనల్ మ్యాచ్ అనేది బిసిసిఐకి చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను అని గంగూలి పేర్కొన్నాడు. ఎందుకంటే ఐపిఎల్ బిసిసిఐకి భారీ ఆస్తి అన్నాడు. ఈ టోర్నమెంట్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించామని చెప్పాడు. ఇంగ్లాండ్ లో జరిగిన సిరీస్ నుంచి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన విధానం నుండి మేము చాలా నేర్చుకున్నామని అన్నాడు.