ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఫినిషర్ గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరోసారి రాణించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్ కి వచ్చిన మహీ 8 బంతుల్లో 2 సిక్సర్లు, 1ఫోర్ తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధోనీ క్రీజులోకి రావడానికి ముందు తన బ్యాట్ ను కొరుకుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. గతంలోనూ పలు సందర్భాల్లో అతడు బ్యాట్ ని కొరుకుతూ కనిపించాడు.
అసలు అతడు అలా చేయడం వెనుక ఉన్న కారణాన్ని తెలిపాడు టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా. ” ధోని బ్యాట్ కొరకడం పై మీకు సందేహాలు ఉన్నాయా.. అయితే వినండి.. మహి తన బ్యాట్ పై ఏదైనా టేప్ లేదా త్రెడ్ ఉంటే దానిని తొలగించేందుకు నోటితో కొరుకుతూ ఉంటాడు. ప్రతిసారి బ్యాటింగ్ కి వెళ్లేముందు ఇలా చేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా ధోని బ్యాట్ ను గమనించండి.. ఎలాంటి టేపు,త్రేడ్ కనిపించవు”. అంటూ ట్వీట్ చేసాడు అమిత్ మిశ్రా.
In case you’re wondering why Dhoni often ‘eats’ his bat. He does that to remove tape of the bat as he likes his bat to be clean. You won’t see a single piece of tape or thread coming out of MS’s bat. #CSKvDC #TATAIPL2022
— Amit Mishra (@MishiAmit) May 8, 2022