ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ కి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 20ఓవర్లు ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కోల కతా ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రితేష్ రానా మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 53పరుగుల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రితేష్ రానా, రాహుల్ త్రిపాఠి పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి స్కోరుబోర్డుని పరుగులు పెట్టించారు.

ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంతంత మాత్రంగానే ఆడారు. కోల్ కతా బ్యాట్స్ మెన్ విషయానికి వస్తే, రితేష్ రానా 80పరుగులు (56బంతుల్లో 9ఫోర్లు 4సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి 53పరుగులు ( 29బంతుల్లో 5ఫోర్లు 2సికర్లు) దినేష్ కార్తిక్ 22పరుగులు( 9బంతుల్లో 2ఫోర్లు ఒక సిక్సర్) చేసారు. హైదరబాద్ బౌలింగ్ లో రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ తలా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ తీసుకున్నారు.