లూసిఫర్ రీమేక్: కింగ్ మేకర్ గా చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి నుండి ఆచార్యపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆసక్తి కలిగించింది. ఆచార్య పూర్తయిన వెంటనే మళయాల చిత్రమైన లూసిఫర్ రీమేక్ పనిలో బిజీగా నిమగ్నమైపోతారు. మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయినట్లు సమాచారం. తాజాగా లూసిఫర్ రీమేక్ నుండి ఒక విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి కింగ్ మేకర్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి పరిశీలనలో ఉందని తెలుస్తుంది. మరి కింగ్ మేకర్ టైటిల్ ఫిక్సా కాదా అనేది తేలాలి. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. ఖైదీ నంబర్ 150 నుండి సైరా ఇప్పుడు ఆచార్య సినిమాలు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లోనే రూపొందాయి. లూసిఫర్ రీమేక్ కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కనుంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.