సన్ రైజర్స్ పై గెలుపుతో అరుదైన ఘనత అందుకున్న నైట్ రైడర్స్..

-

ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచులో అద్భుతమైన ప్రదర్శనతో విజయాన్నందుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు, తన ఖాతాలో మరో అద్భుతమైన రికార్డును వేసుకుంది. కోల్ కతా నిర్దేశించిన 188పరుగులను అందుకోవడంలో సన్ రైజర్స్ వెనకబడడంతో ఆ రికార్డు కోల్ కతా సొంతం అయ్యింది. రితేష్ రానా, రాహుల్ త్రిపాఠి అద్భుతమైన భాగస్వామ్యం, ఆండ్రూ రస్సెల్ డెత్ ఓవర్ అన్నీ కలిపి కోల్ కతాకి విజయాన్ని అందించాయి.

ఐతే ఈ విజయంతో ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో వంద మ్యాచులు గెలిచిన జట్టుగా కోల్ కతా నిలిచింది. మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో వంద మ్యాచులు గెలుచిన జట్టుగా నిలిచింది. ఐతే ఈ ఘనత ఆల్రెడీ రెండు జట్లు సాధించాయి. ఐపీఎల్ ఫేవరేట్లుగా చెప్పుకునే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ఘనతని సాధించాయి. ఇప్పుడు కోల్ కతా గెలవడంతో ఆ ఘనత అందుకున్న మూడవ జట్టుగా రికార్డుకెక్కింది. అది కూడా ఐపీఎల్ 14వ సీజన్ మొదటి మ్యాచులోనే అందుకోవడం యాదృచ్చికం.

 

వంద మ్యాచులు గెలిచిన జట్లలో ముంబై ఇండియన్స్ 120మ్యాచులతో మొదటి స్థానంలో ఉండగా, 106మ్యాచులతో చెన్నై సూపర్ కింగ్స్ రెండవ స్థానంలో నిలిచింది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని నైట్ రైడర్స్ జట్టు మొదటి మ్యాచు గెలిచి జట్టుకి మంచి శుభారంభాన్ని ఇచ్చింది. మరి ఇదే పటిమని తదుపరి మ్యాచుల్లో కనబర్చి ఈ ఐపీఎల్ సీజన్లో చెరగని ముద్ర వేస్తుందేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news