కేఎల్ రాహుల్ లవ్ మ్యారేజ్ కి ముహూర్తం ఖరారు?.

-

టీమిండియా స్టార్ ప్లేయర్, లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పెళ్లిపై తాజా అప్డేట్.త్వరలోనే అతను పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.ఈ సంవత్సరమే ఓ ఇంటివాడు కానున్నాడు.తన గర్ల్ ఫ్రెండ్ అతియా శెట్టి ని పెళ్ళాడనున్నాడు.ఈ సంవత్సరం చివర్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోనున్నారు.దీనికి కేఎల్ రాహుల్- అతియా శెట్టి కుటుంబాల వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.కేఎల్ రాహుల్ గతకొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి తో ప్రేమ లో ఉంటున్నాడు.ఆమె నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటించింది.2015 లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది అతియా.

అనంతరం ముబారకన్,నవాబ్దాదే, మోతిచూర్ చక్నాచూర్, మూవీల్లో మెరిసింది.ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె.సునీల్ శెట్టిది తుళు ఫ్యామిలీ.మంగళూరు కొప్పల సమీపంలోని ముల్కి వారి స్వస్థలం.అనంతరం బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో సునీల్ శెట్టి ముంబైలో స్థిరపడ్డారు.కేఎల్ రాహుల్ స్వస్థలం కూడా మంగళూరే.అతనితో పెళ్లి కి రెండు కుటుంబాలవారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ ఏడాది చివరిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు.

https://www.instagram.com/p/Cce2L6QBVrf/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news