ధోనీ రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో కోహ్లీ..

-

అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ కొట్టని రికార్డు లేదు. వరుస పెట్టి రికార్డుల మోత మోగిస్తున్నాడు కోహ్లీ. తాజాగా మరో రికార్డు అతని ఖాతాలో చేరబోతుంది. అవును, ఇప్పటివరకు కోహ్లీ కెప్టెన్సీలో 59మ్యాచులాడిన భారత జట్టు మరొక్క మ్యాచ్ ఆడితే ధోనీ రికార్డును అందుకుంటుంది. ఇంగ్లండ్ తో అహమ్మాదాబాద్ లో జరగబోయే మ్యాచుతో కోహ్లీ ఆ రికార్డును సమం చేస్తాడు. ఈ మ్యాచ్ గెలిచినా లేదా డ్రాగా ముగించుకున్నా జూన్ లో జరగబోయే న్యూజిలాండ్ మ్యాచుతో ధోనీ రికార్డుని బద్దలు కొడతాడు.

ఇప్పటికే అత్యధిక టెస్ట్ మ్యచులు అందించిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ 35విజయాలని అందిస్తే, ధోనీ 27విజయాలు అందించాడు. ఆ 35 విజయాల్లో 22మ్యాచులు మనదేశంలో జరిగితే మరో 13మ్యాచులు విదేశాల్లో జరిగాయి. ఇండియా తరపున్న ఎక్కువ టెస్ట్ మ్యాచులకి సారథ్యం వహించిన వారిని చూసుకుంటే ముందుగా కోహ్లీ, ధోనీ, సౌరవ్ గంగూలీ, అజహారుద్దీన్, సునీల్ గవాస్మర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news