ఐసీసీ ర్యాంకింగ్స్ లో పడిపోయిన కోహ్లీ స్థానం..

Join Our Community
follow manalokam on social media

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన ర్యాకింగ్ లో వెనకపడ్డాడు. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం కోల్పోయి ఐదవ స్థానానికి వచ్చాడు. బ్యాటింగ్ లో తన స్థానం వెనక్కి రావడం కొంత ఆశ్చర్యకరమే అయినా, ఈ సారి ఐదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొదటి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ ఉండగా రెండవ స్థానంలో స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఇక మూడవ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు రూట్, రెండు స్థానాలను మెరుగుపర్చుకున్నాడు.

భారత బ్యాట్స్ మెన్లలో పుజారా ఏడవ స్థానంలో ఉన్నాడు. అంతకుముందు పుజారా స్థానం ఆరవ ప్లేస్ లో ఉండేవాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే అశ్విన్, బుమ్రా ఒక్కో స్థానం మెరుగుపడి 7, 8స్థానాల్లో ఉన్నారు. మొత్తానికి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్ మ్యాచు ముగిసే సమయానికి ఒక్కొక్కరి ర్యాంక్స్ ఒక్కోలా ఉన్నాయి. ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండవ టెస్ట్ మ్యాచ్ కి సిద్ధం అవుతుంది.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...