కేరళలో 192 మంది విద్యార్థులకు కరోనా..!

-

గతేడాది ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఏడాది విద్యాసంస్థలు అన్ని మూతపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించినా, విద్యార్థులకు అంతగా పాఠాలు అర్థం కాలేదు. అయినా తప్పని పరిస్థితుల్లో వినాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాల వారీగా సామాజిక దూరం, విడదల వారీగా తరగతులు ప్రారంభించారు. ఏడాది తర్వాత ప్రత్యేక్ష తరగతులకు హాజరైన విద్యార్థులు ఆనందపడుతున్న క్రమంలో కేరళలోని రెండు పాఠశాల్లో కలిపి 192 మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో రాష్ట్రం మొత్తం భయాందోళనకు గురవుతున్నారు.

72 మంది ఉపాధ్యాయులకు..

కేరళలోని మలప్పురంలోని ఓ రెండు పాఠశాలలకు చెందిన 192 మంది విద్యార్థులకు కరోనా సోకగా, వారిలో 149 మంది ఒకే పాఠశాలకు చెందిన వారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మరో 91 మంది విద్యార్థులంతా ఒకే ట్యూషన్‌కి వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం విద్యార్థులతో పాటు వారి కుటుంబీలందరికీ పరీక్షల నిర్వహించే పనిలో పడ్డారు. అనుమానం ఉన్న వారందరికీ పరీక్షలు చేస్తుండంతో అందరికీ పాజిటివ్‌ రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. రెండు పాఠశాలలు, ట్యూషన్‌లో వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు సైతం కరోనా పరీక్షలు చేసుకోగా వారిలో 72 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రెండు పాఠశాలలను మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news