ఆసియా కప్‌తో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ T20లో ఇరగదీస్తున్నాడు. సంచలన రన్నింగ్స్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. బుధవారం రోజున బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పరుగుల వీరుడు మరో రికార్డును సృష్టించాడు. T20 ప్రపంచకప్ టోర్నీలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనే పేరిట ఉన్న రికార్డును చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన రికార్డును కోహ్లీ అధిగమించడంపై జయవర్దనే స్పందించాడు.
‘‘రికార్డులు ఉన్నవే కొల్లగొట్టేందుకు. నా రికార్డులు చెరిపేసి కొత్తవి సృష్టించేందుకు ఒకడుంటాడు. అతడే విరాట్. ఈ గొప్ప ఆటగాడికి నా అభినందనలు. నువ్వెప్పుడూ యోధుడివే. ఫామ్ ఎప్పుడూ తాత్కాలికమే. క్లాస్ మాత్రమే శాశ్వతం. బాగా ఆడావు మిత్రమా’’ అంటూ కొనియాడాడు. 31 ఇన్నింగ్స్‌లో 1,016 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జయవర్దనేను కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ(1,065) అధిగమించడం విశేషం.
ఇక బంగ్లాతో ఉత్కంఠభరిత మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అతి కష్టం మీద బయటపడింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో రోహిత్ సేన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన విషయం తెలిసిందే.