కరోనా తర్వాత క్రికెట్ ఆటని ప్రత్యక్షంగా చూడడం అనేది కష్టంగా మారిపోయింది. వైరస్ ఎప్పుడు విజృంభిస్తుందో తెలియని నేపథ్యంలో ఆటను టీవీల ద్వారానే వీక్షిస్తున్నారు. ఐతే మరికొద్ది రోజుల్లో ప్రత్యక్షంగా మైదానంలో ఆటని చూసే అవకాశం కలగనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్ చేసినట్టు సమాచారం. 2021 నవంబరు నుండి 2022జూన్ వరకు ఇండియాలో మొత్తం 21మ్యాచులు జరగనున్నాయి. ఇండియాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో మ్యాచ్ జరగనుంది.
ఆ మ్యాచులు జరిగే ప్రాంతాల్లో హైదరాబాద్ కి చోటు దక్కలేదు. అవును, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఒక్క మ్యాచు కూడా జరగట్లేదు. స్టేడియం అసోసియేషన్ లో జరుగుతున్న అంతర్గత కలహాలే ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న కలహాలు మ్యాచులను హైదరాబాద్ రానివ్వకుండా చేసాయని అంటున్నారు. 14టీ20లు, 4టెస్టులు, 3వన్డే మ్యాచులు ఆడనున్న టీమ్ ఇండియా, ఒక్క మ్యాచును కూడా హైదరాబాద్ లో ఆడట్లేదు.