పుకార్లకు చెక్ పెట్టాలని సమంత ప్రయత్నం.. అందుకే ఆ ట్వీట్ డిలీట్ చేసిందా?

-

అక్కినేని నాగచైతన్య, సమంత అక్కినేని వైవాహిక జీవితం సరిగ్గా సాగట్లేదని, వారిద్దరూ విడిపోయే దశలో ఉన్నారంటూ పుకార్లు షికారు చేసాయి. ఈ మేరకు ఊతమిచ్చింది సమంత సోషల్ మీడియా పేజీలో జరుగుతున్న మార్పులే. ఇన్స్టాగ్రామ్ పేజీలో అక్కినేని అన్న ఇంటిపేరును మార్చడంతో చాలామందిలో అనేక సందేహాలు కలిగాయి. ఫేస్ బుక్ పేజీకీ అక్కినేని అన్న పేరు అలాగే ఉన్నప్పటికీ పుకార్లు మాత్రం ఆగలేదు. తాజాగా సమంత చేసిన ట్వీట్, పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.

అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా నాగార్జున ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ కి సమాధానం ఇచ్చిన సమంత, నాగార్జున మామ అని పోస్ట్ చేసింది. ఐతే మామ అన్న పదం మొదట చేసిన ట్వీట్ లో లేనట్లు, ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసి, మామ అన్న పదం కలిపి మళ్ళీ పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అనవసర పుకార్లకు ఊతమివ్వడం ఎందుకు అన్న ఉద్దేశ్యంలో సమంత ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news