ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు కు నామినీలు వీళ్లే

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు కు నామినీ ల‌ను ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిది. కాగ గ‌త కొంత కాలం నుంచి ఐసీసీత ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు ను ప్ర‌ధానం చేస్తుంది. ప్ర‌స్తుతం అక్టొబ‌ర్ నెల‌కు సంబంధించ‌న నామినీ ల‌ను ఐసీసీ ఈ రోజు ప్ర‌క‌టించింది.

మెన్స్ విభాగంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్, పాకిస్థాన్ నుంచి స్టార్ బ్యాట‌ర్ ఆసిఫ్ అలీ తో పాటు న‌మీబియా దేశానికి చెందిన బ్యాట‌ర్ డేవిడ్ వీజ్ ఈ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు కు నామినీ లు ఎంపిక అయ్యారు. అయితే ఈ అవార్డు కు టీమిండియా నుంచి ఒక్క‌రూ కూడా నామినీ గా ఎంపిక కాలేక పోయారు. అయితే టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ లో టీమిండియా ఆట‌గాళ్లు ఏ ఒక్క‌రూ కూడా రాణించ‌క పోయారు. దీంతో నే ఈ లీస్ట్ లో టీమిండియా ఆట‌గాళ్లు లేరు.

అలాగే మ‌హిళ‌ల విభాగంలో ఐర్లాండ్ ఆల్ రౌండ‌ర్ లాకా డెలాని తో పాటు బ్యాట‌ర్ గాబీ లూయీస్ అలాగే జింబాబ్వే కెప్టెన్ మేరీ అన్నే ముసొండ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ కు నామినీ లు గా నిలిచారు. అయితే క్రిడకారుల ప్ర‌తిభ ను ప్ర‌తి నెల అభినందించ‌డానికి ఈ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు ను ఐసీసీ ముందుకు తీసుకు వ‌చ్చింది.