ఇంగ్లండ్ మీద ధోనీ కొట్టిన ఆరు సిక్సర్లని ఇప్పుడప్పుడే మర్చిపోరు. కెప్టెన్ ఫ్లింటాఫ్ తో ఏదో చిన్నపాటి గొడవ లాంటిది జరిగి, ఆ తరువాత స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో విజృంభించి వచ్చిన ప్రతీ బంతిని మైదానం అవతలికి పంపించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఇలాంటి ఫీట్ మళ్ళీ మన ఆటగాళ్ళెవరూ రిపీట్ చేయలేదు. కానీ దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్ యువరాజ్ కంటే ముందుగానే ఈ ఘనత అందుకున్నాడు. తాజాగా వెస్టిండీస్ ఆటగాడు పొలార్డ్ కూడా వీరిద్దరి పక్కన చేరాడు.
శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ మ్యాచులో 131పరుగుల లక్ష్య ఛేధనలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిఉ కేవలం 14ఓవర్లోనే గెలుపు సాధించారు. లంక బౌలర్ అకిల ధనంజయ, ఈ మ్యాచులో హ్యాట్రిక్ సాధించగా, అతని బౌలింగ్ లోనే పొలార్డ్ ఈ ఫీట్ సాధించడం కొసమెరుపు. మొత్తానికి 14ఏళ్ల తర్వాత యువరాజ్ రికార్డు రిపీట్ రిపీట్ అయ్యింది.