తండ్రి అయిన సౌతాఫ్రికా క్రికెట‌ర్ డికాక్

సౌత్ ఆఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింటాన్ డికాక్ తండ్రి అయ్యాడు. క్వింటాన్ డికాక్ భార్య సాషా పాప కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని క్వింటాన్ డికాక్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా త‌ప పాప, భార్య‌తో ఉన్న ఫోటోను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే త‌న పాప‌కు కియారా అనే పేరు కూడా పెట్టిన‌ట్టు క్వింటాన్ డికాక్ తెలిపాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు సిరీస్ లోని మొద‌టి టెస్టు కు క్వింటాన్ డికాక్ ఆడాడు.

త‌ర్వాత సెంక‌డ్ టెస్టు ఆడ‌లేదు. త‌న భార్య కోసం సెంక‌డ్ టెస్టు నుంచి క్వింటాన్ డికాక్ త‌ప్పుకున్నాడు. అయితే తొలి టెస్టు ఆడిన త‌ర్వాత క్వింటాన్ డికాక్ త‌న‌ టెస్టు ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్ర‌కటించాడు. ఈ 29 ఏళ్ల స్టార్ బ్యాట‌ర్, వికెట్ కీప‌ర్ టెస్టు ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే తాను టెస్టు క్రికెట్ ను త‌ప్పుకుని ప‌రిమితి ఓవ‌ర్ల మ్యాచ్ ల‌పై ఫోక‌స్ పెడుతాన‌ని క్వింటాన్ డికాక్ ప్ర‌క‌టించాడు. అలాగే త‌న కూతురు కియారాతో త‌న భార్య సాషాతో స‌మ‌యం గ‌డ‌పాల‌ని క్వింటాన్ డికాక్ భావించాడ‌ని కూడా తెలుస్తుంది.