టీమిండియాపై స్మిత్‌ అరుదైన రికార్డు..!

-

భారత్ ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ 390 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టీమిండియాపై అరుదైన రికార్డు సాధించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టీవ్‌ స్మిత్‌ వరుసగా రెండో సెంచరీ సాధించాడు.

smith
smith

అయితే మొదటి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్మిత్‌ రెండో వన్డేలో మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన స్మిత్‌ 104 పరుగుల వద్ద హార్దిక్‌ పాం‍డ్యా బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి 50 పరుగులను 38 బంతులు తీసుకున్న స్మిత్‌ మలి 50 పరుగులను కేవలం 24 బంతుల్లోనే సాధించడం విశేషం

ఓవరాల్‌గా వన్డేల్లో స్మిత్‌ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో టీమిండియాపైనే 5 సెంచరీలు సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా పాంటింగ్‌ వన్డేల్లో టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటిస్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్‌ 6 సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు అవసరం కాగా.. స్మిత్‌ మాత్రం 20 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం.

ఇక స్మిత్‌ ఇన్నింగ్స్‌ దాటికి భారత బౌలర్లలో ఏ ఒక్కరు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. ఇక రెండో వన్డేలో ఆసీస్‌ 50 ఓవర్లలో 389 పరుగులు చేసింది. చివర్లో మ్యాక్స్‌వెల్‌ 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేయగా.. మార్నస్‌ లబుషేన్‌ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటుందో.. లేక చతికిలపడుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news