టీమిండియా కొత్త జెర్సీపై మీరు ఓ లుక్కేయండి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి ఆరంభం కానున్న ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే ప్రతిష్టాత్మక ఈ ఫైనల్‌లో టీమిండియా కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది..

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ కొత్త జెర్సీకి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు. రైట్ కార్నర్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ లోగోతో కనిపిస్తున్న ఈ జెర్సీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జెర్సీ 1990ల నాటి జెర్సీలా కనిపిస్తోండగా… జడేజా కూడా ‘రివైండ్‌ టు 90s’ అని తన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు.

కాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించిన విషయం తెల్సిందే. మొత్తం 24 మందితో కూడిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు కూడా టీమిండియా ఇదే జట్టుతో బరిలోకి దిగనుంది.