టీమిండియా మహిళల జట్టు దారుణమైన ప్రదర్శనలు చేస్తుంది. న్యూజిలాండ్ తో జరుగుతన్న ఐదు వన్డేల సిరీసలో నేడు మూడో మ్యాచ్ లోనూ ఓటమి పాలైంది. ఈ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ మహిళ జట్టు 3-0 తేడాతో వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కాగ నేటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 279 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగ టీమిండియా ఓపెనర్లు.. మేఘన (61), షఫాలీ వర్మ (51) పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చారు. వీరు తొలి వికెటుకు 100 పరుగులు జోడించారు. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు.. చేతులెత్తేశారు. దీప్తి శర్మ (69) మాత్రమే నిలకడగా ఆడారు. అలాగే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో మొదటి ఓవర్లో బౌలర్ జూలన్ గో స్వామి ఆకట్టుకుంది.
మొదటి ఓవర్లోనే ఓపెనర్ ను పేవిలియన్ కు పంపించింది. తర్వాతి ఓవర్లో మరో కీలక బ్యాటర్ ను అవుట్ చేసింది. దీంతో 2.3 ఓవర్లో 2 కీలక వికెట్లను న్యూజిలాండ్ కోల్పొయింది. తర్వాత అమేలియా కెర్ (67), అమీ సాటర్త్ వైట్ (59), లారెన్ డౌన్ (64) రాణించారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధించింది. లారెడన్ డౌన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.