నేడు విజ‌య్ హ‌జారే ట్రోఫి ఫైన‌ల్ పోరు

విజ‌య్ హ‌జారే ట్రోఫి ఫైన‌ల్ పోరుకు సిద్ధం అయింది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ‌స్థాన్ లోని జైపూర్ లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఈ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతుంది. ఫైన‌ల్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ త‌మిళ‌నాడు తో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌బోతుంది. గ‌త ఏడాది ఈ టోర్నీని గెలిచిన త‌మిళ‌నాడు జ‌ట్టు మ‌రో సారి టైటిల్ ను కైవ‌సం చేసుకోవాల‌ని అనుకుంటుంది. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ జ‌ట్టు త‌న కేరీర్ లో మొద‌టి సారి విజ‌య్ హ‌జారే ట్రోఫిని ముద్దాడాల‌ని అనుకుంటుంది.

కాగ తమిళ‌నాడు జ‌ట్టు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ బలంగా ఉంది. కెప్టెన్ విజ‌య్ శంక‌ర్ తో పాటు సీనియ‌ర్ బ్యాట‌ర్ దినేశ్ కార్తిక్, షారుక్ ఖాన్ తో బ్యాట్స్ మెన్ బ‌లంగా ఉన్నారు. అలాగే ట్విన్ బ్ర‌ద‌ర్స్ బాబా అప‌రాజిత్, బాబా ఇంద్ర‌జిత్ మంచి ఫామ్ లో ఉన్నారు. వీరితో భారీ స్కోర్ సాధ్యం అవుతుంది. అయితే హిమాచాల్ ప్ర‌దేశ్ జ‌ట్టు కూడా ఆల్ రౌండ‌ర్ షో మ్యాచ్ ల‌లో విజ‌యం సాధిస్తు వ‌చ్చింది. కెప్టెన్ రిషి ధావ‌న్ బ్యాట్ తోనూ బాల్ తోనూ మంచి ఫ‌లితాలు ఇస్తున్నాడు. అలాగే ఇత‌ర బ్యాట‌ర్స్ కూడా మంచి ఫామ్ లో ఉండ‌టంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగే అవ‌కాశం ఉంది.