ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 41వ ఓవర్‌లో ఆ జట్టు ప్లేయర్ కామరాన్ గ్రీన్ కు భారత బౌలర్ అశ్విన్ బౌలింగ్ చేయగా.. గ్రీన్ ఆ బంతిని షాట్ కొట్టేందుకు యత్నించాడు. దీంతో ఆ బంతి మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి బంతిని డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో కోహ్లి పట్టిన ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోహ్లి అలా క్యాచ్ పట్టడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమర్శకులకు కోహ్లి ఈ క్యాచ్‌తో గట్టి సమాధానం చెప్పాడని పలువురు కామెంట్లు చేశారు. అయితే నిజానికి మ్యాచ్‌లో ఇతర భారత ప్లేయర్లు కొన్ని చాన్స్‌లను విడిచిపెట్టారు. ఆసీస్ ప్లేయర్ లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌లను భారత ప్లేయర్లు వదిలేశారు. దీంతో లబుషేన్‌కు పలు మార్లు లైఫ్ లభించింది. అయితే ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 191 పరుగుల వద్ద ముగించింది.
Cameron Green's debut innings was stopped short by an absolute classic from Virat Kohli – and the Indian captain enjoyed it a lot! #OhWhatAFeeling@toyota_Aus | #AUSvIND pic.twitter.com/krXXaZI1at
— cricket.com.au (@cricketcomau) December 18, 2020
మొత్తం 72.1 ఓవర్లు ఆడిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ అయింది. కోహ్లి అద్భుతంగా రాణించి 74 పరుగులు చేశాడు. అలాగే చటేశ్వర్ పుజారా, రహానెలు కూడా ఫర్వాలేదనిపించారు.