క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి వేడుకలు ప్రారంభం

-

టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కే ఎల్ రాహుల్ తో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియ శెట్టి వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. మహారాష్ట్రలోని ఖండాలలో సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో శనివారం ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెళ్లి తర్వాత బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ పార్టీలు జరుపుకోనున్నట్లు సమాచారం. దీనికి టీమిండియా ప్లేయర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఇక్కడున్న ఈ స్టార్ కపుల్ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ వివాహానికి పెద్దలు రీసెంట్ గా పచ్చ జెండా ఊపడంతో పెళ్లికి భాజా భజంత్రీలు మోగాయి. ఖండాలలో ఉన్న సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో పెళ్లి కోసం అందంగా అలంకరించిన మండపానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చని చెట్లతో నిండిన సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news