ఐపిఎల్ లో భాగంగా నిన్న గౌహతి వేదికగా పంజాబ్ మరియు రాజస్థాన్ జట్ల మధ్యన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ సేన నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్ కు ఉన్న బ్యాటింగ్ లైన్ అప్ చూస్తే చేజింగ్ చాలా సులభంగా చేస్తారు అనుకున్నారు అంతా, కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అశ్విన్ ఖాతా తెరవకుండానే ఔట్ కాగా, జైస్వాల్ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలా ఒక్కొక్కరూ పెవిలియన్ కు క్యు కట్టారు. శాంసన్ కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా అనవసర షాట్ కు పోయి ఎల్లిస్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆఖరి రెండు ఓవర్ లలో 34 పరుగులు చేయాల్సిన దశలో యువ ఆటగాడు జురెల్ రాజస్థాన్ ను ఆదుకొనే ప్రయత్నం చేసినా చివరి ఓవర్ ను సాం కర్రాన్ కట్టుదిట్టంగా వేయడంతో రాజస్థాన్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.
ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ కెప్టెన్సీ కి ప్రశంసలు దక్కుతున్నాయి. శిఖర్ బ్యాటింగ్ లో 86 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలవగా, తన కెప్టెన్సీ తోనూ రాణించి జట్టుకు వరుసగా రెండవ విజయాన్ని అందించాడు. దాదాపు చాలా సీజన్ ల తర్వాత పంజాబ్ స్టార్టింగ్ లో వరుసగా మ్యాచ్ లు గెలవడం పట్ల అభిమానులు మరియు యాజమాన్యం సంతృప్తిగా ఉన్నారు.