IPL 2023 : రిటైర్మెంట్ పై ధోని సంచలన వ్యాఖ్యలు

-

ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో CSK విజయం సాధించింది. వర్షం ఆగిన తర్వాత తిరిగి ప్రారంభమైన పోరులో డక్ వర్త్ లూయిస్ ప్రకారము 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 5 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్స్ గా వచ్చిన ఋతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 26, కాన్వే 25 బంతుల్లో 47, శివమ్ దూబె 21 బంతుల్లో 32*, రహానే 8 బంతుల్లో 19, జడేజా 6 బంతుల్లో 15* రన్స్ చేశారు. అయితే.. మ్యాచ్‌ అనంతరం ఎంఎస్. ధోని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది సరైన సమయం.. కానీ నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. సీజన్ తొలి మ్యాచులో అందరూ నా పేరును జపిస్తుంటే ఎమోషనల్ అయ్యాను..స్టేడియంలో అభిమానులు నా పేరును అరుస్తుంటే కళ్ళలో నీళ్లు నిండిపోయాయని వివరించారు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లడం సులభం కానీ మరో తొమ్మిది నెలలు వెయిట్ చేసి ఐపీఎల్ ఆడటం కష్టమని.. మీ కోసం మరో ఐపీఎల్ ఆడటానికి ప్రయత్నిస్తాను.. ఇది మీ అందరికి గిఫ్ట్ గా ఉంటుంది.. కానీ నా బాడీకి కష్టతరం అని ధోని చెప్పాడు. మీ ప్రేమను నేను ఇంకా ఆస్వాదించాలనుకుంటున్నాననని వెల్లడించారు ధోని.

Read more RELATED
Recommended to you

Latest news