Dinesh Karthik Retirement: ఐపీఎల్‌కు దినేష్ కార్తీక్‌ గుడ్ బై!

-

Dinesh Karthik Signals Retirement From IPLక్రికెట్ అభిమానులను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశ పరిచింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది బెంగళూరు జట్టు. దీంతో ఇంటికి పయనమైంది RCB. ఈ తరుణంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంచలన ప్రకటన చేసాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు కార్తీక్.

Dinesh Karthik Signals Retirement From IPL

అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఓవైపు లీగ్ కు వీడ్కోలు పలికిన బాధ, మరోవైపు టోర్నీ నుంచి ఆర్సిబి నిష్క్రమించిన నిరాశతో కార్తీక్ కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని వీడాడు. దినేష్ కార్తీక్ ఆర్సిబి ఆటగాళ్లకు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ పెవిలియన్ కు చేరారు. అయితే డీకే తన రిటైర్మెంట్ పై అధికారికంగా ఎలాంటి నోట్ ను రిలీజ్ చేయలేదు. కానీ పరోక్షంగా క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.

Read more RELATED
Recommended to you

Latest news