పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు తీవ్ర అస్వస్థత.. టెస్ట్ సిరీస్ రద్దు!

ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే ఊహించని షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లకు గుర్తుతెలియని వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హరి బ్రూక్, జాక్ క్రాలి, కీటన్ బెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ ఒకటి నుంచి రావల్పిండి వేదికగా జరగాల్సిన తొలిటెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే ఇప్పటివరకు పిసిబి, ఈసీబీలో మ్యాచ్ నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జట్టులో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో కనీసం 11 మంది కూడా ఆడడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ ఆటగాళ్లకు సోకిన వైరస్ కరోనా కంటే ప్రమాదకరమని తెలిస్తే మాత్రం సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్ల రిపోర్ట్స్ వచ్చాక అసలు విషయం బయటపడుతుంది. అయితే ఇంగ్లాండ్ జట్టుకు సోకిన వైరస్ కు కోవిడ్-19 తో ఎలాంటి సంబంధం లేదని, తీవ్రమైన కడుపు నొప్పితో మాత్రం బాధపడుతున్నట్లు తేలిందని వైద్యులు పేర్కొన్నారు.