వామ్మో ఏకంగా ఆరు క్యాచులు వదిలేసారు… అదే కొంప ముంచింది…!

-

క్రికెట్ లో ఫీల్డింగ్ అనేది చాలా చాలా కీలకం. ఒక్క బంతితో, ఒక్క పరుగుతో క్షణాల్లో ఫలితం మారిపోతు ఉంటుంది. విజయం అంచుల వరకు వెళ్ళిన తర్వాత కూడా చేసే చిన్న చిన్న తప్పులు జట్టు ఓటమిపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రత్యర్ధి జట్లకు అదే అవకాశంగా మారుతూ ఉంటుంది. అందుకే ఆటగాళ్ళు ఫీల్డింగ్ చేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని క్రీడా పండితులు కూడా పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమికి కేవలం క్యాచులే కారణం అయ్యాయి.

ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 సాయంతో పరుగులు, జిమ్మీ నీషమ్ 22 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో సాయంతో 42 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచాడు. ఇంగ్లాండ్ జట్టు 11 ఓవర్లకు గాను 94 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉండగా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

మరో బంతి మిగిలి ఉండగానే 155 పరుగులకు చాప చుట్టేసింది. ఇక్కడ ఇంగ్లాండ్ ఓటమికి, కివీస్ జట్టు మంచి స్కోర్ సాధించడానికి కారణం ఇంగ్లాండ్ ఫీల్డింగ్ వైఫల్యాలే… ఒకపక్క కివీస్ ఆటగాడు గ్రాండ్‌హోమ్ నాలుగు క్యాచ్‌లు పట్టి ఇంగ్లాండ్ ని ఇబ్బంది పెట్టగా ఇంగ్లాండ్ జట్టు ఏకంగా ఆరు క్యాచులు వదిలేసి సీరీస్ ని చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటె రెండు మ్యాచుల సీరీస్ ని దక్కి౦చుకునేది. అందివచ్చిన అవకాశాలను వదులుకుని సీరీస్ ని సమం చేసుకుంది ఇంగ్లాండ్.

Read more RELATED
Recommended to you

Latest news