టీమిండియా మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కు తీవ్ర గాయాలు

-

టీమిండియా మాజీ క్రికెటర్ ఉన్ముక్త్‌ చంద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఏమైందో తెలియదు కానీ, ఉన్నట్టు ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయం అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఉన్ముక్త్‌ చంద్‌ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన కంటి గాయానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు ఉన్ముక్త్‌ చంద్‌. ఈ ఫోటోలో అతని ఎడమ కన్ను కనిపించకుండా పూర్తిగా మూసుకుపోయింది.

బంతి బలంగా అతని ఎడమ కన్నుకు తాకినట్లు మనకు అర్థమవుతోంది. అట్లెట్ జీవితం సాఫీగా సాగిపోదనడానికి తన గాయమై నిదర్శనం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఉన్ముక్త్‌ చంద్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తనకు పెద్ద ప్రమాదం తప్పిందని త్వరలోనే తాను కోరుకుంటానని కూడా ఉన్ముక్త్‌ చంద్‌ ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఉన్ముక్త్‌ చంద్‌ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు ఫ్యాన్స్‌.

Read more RELATED
Recommended to you

Latest news