బిజినెస్ ఐడియా: లక్షల్లో లాభాలను అందించే వెల్లుల్లి పంట..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యవసాయం పై మక్కువ చూపిస్తున్నారు. చక్కటి లాభాలను కలిగే పంటల్ని వేస్తూ అధికంగా లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా యువత కూడా పంటలపై ఆసక్తి చూపిస్తోంది చాలా మంది యువకులు వివిధ రకాల పంటలు వేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు.

వ్యవసాయం చేయాలన్నా మంచి లాభాలను పొందాలన్నా ఎటువంటి పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది..?, ఎక్కువ లాభాలను ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుని అనుసరిస్తే సక్సెస్ అవ్వొచ్చు. వాణిజ్య పంటలతో డబ్బులు బాగా వస్తాయి. ఉద్యోగాలను వదిలేసే వాణిజ్య పంటల పై ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది. అయితే అలాంటి పంటల్లో వెల్లుల్లి కూడా ఒకటి.

వెల్లుల్లిని సాగు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వెల్లుల్లి సాగుకు సంబంధించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ వంటల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లి వల్ల వంటకు రుచి వస్తుంది పైగా ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి వల్ల చాలా మేలు కలుగుతుంది.

ఈ వెల్లుల్లి సాగు చేయడానికి వానాకాలం అయిపోవాలి. ఆ తర్వాత సాగుని ప్రారంభించవచ్చు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ సాగుకు అనుకూలంగా ఉంటుంది. వెల్లుల్లి మొగ్గల నుండి వెల్లుల్లి పండిస్తూ ఉంటారు ఈ పంట వేయడానికి ఎటువంటి నేల అయినా బాగుంటుంది. ఒక ఎకరంలో వెల్లుల్లి సాగు చేస్తే 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

ఒక క్వింటాల్ వెల్లుల్లి ధర మార్కెట్లో పది వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. ఒక ఎకరంలో పండించడానికి 40 వేల వరకు ఖర్చు అవుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాణ్యమైన వెల్లుల్లిని పండించి మంచిగా లాభాలను పొందవచ్చు. మంచి రకమైన వెల్లుల్లిని కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇలా వెల్లుల్లి సాగు తో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news