IPL 2023 : గాయమైన.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్ డుప్లెసిస్

-

చెన్నై తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరాడి ఓడింది. చివరి బంతి వరకు గెలుపు కోసం వేచి చూసిన ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే, టీం గెలుపు కోసం కెప్టెన్ డూప్లేసిస్ పై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. నడుముకు గాయమైన, కట్లు కట్టుకొని సిక్సులు, ఫోర్లు కొట్టి 62 రన్స్ తో అద్భుతమైన ప్రదర్శన చూపారు.

‘డూప్లెసెస్ నువ్వో యోధుడివి’ అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా చివర్లో భారీ షాట్ లకు ప్రయత్నించి ముందుగా మాక్స్ వెల్ ఆ తర్వాత డుప్లిసిస్ ఔట్ అవ్వడంతో RCB విజయానికి బ్రేకులు పడ్డాయి. అనంతరం దినేష్ కార్తిక్ RCB ను రేస్ లో ఉంచినా అతడు కూడా కీలక సమయంలో ఔట్ అవ్వడంతో మ్యాచ్ చెన్నై వైపుకు మొగ్గింది. షాహబాజ్ అహ్మద్ మరియు పార్నల్ లు సరిగా ఆడి ఉంటే గెలుపు దక్కేది. కానీ వీరి వైఫల్యం మరియు ధోనీ కెప్టెన్సీ అనుభవం ముందు RCB ఓటమి తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news