IPL 2023 : ఐపీఎల్ లో RCB బౌలర్ చెత్త రికార్డు

-

నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చిన అతడు ఒక వికెట్ మాత్రమే తీసి ఆర్సిబి తరపున అత్యంత చెత్త స్పెల్ చేసిన రెండో బౌలర్ గా నిలిచాడు. గతేడాది పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి బౌలర్ జోష్ హేజిల్ వుడ్ 4 ఓవర్లలో 64 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇప్పటికీ అదే ఆర్సిబి తరపున చెత్త స్పెల్ గా ఉంది.

కాగా, చెన్నై తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరాడి ఓడింది. చివరి బంతి వరకు గెలుపు కోసం వేచి చూసిన ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే, టీం గెలుపు కోసం కెప్టెన్ డూప్లేసిస్ పై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. నడుముకు గాయమైన, కట్లు కట్టుకొని సిక్సులు, ఫోర్లు కొట్టి 62 రన్స్ తో అద్భుతమైన ప్రదర్శన చూపారు. ‘డూప్లెసెస్ నువ్వో యోధుడివి’ అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news