టీమిండియా కు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారధి రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ గతేడాది వరకు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగేది. టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగినన్ని రోజులు రోహిత్ ఎడమొహం పెడమొహంగా ఉండడం, సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి ఆటగాళ్ల సతీమణులు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ఐపీఎల్ 2020 సీజన్ లో టాస్ సందర్భంగా ఒకరికి ఒకరు చూసుకోకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.
అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ ఎందుకు రాలేదో తనకు తెలియదని ప్రెస్ మీట్ లో విరాట్ కోహ్లీ చెప్పడంతో ఈ ఇద్దరు మధ్య గొడవలు నిజమేనని అంతా అనుకున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. వారిద్దరి మధ్య స్వల్ప విభేదాలు అన్నమాట వాస్తవమేనని చెప్పాడు. ధోని రిటైర్ అయ్యాక ఆ గొడవలు ఎక్కువ అయ్యాయని తెలిపారు. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం అప్పటి కోచ్ రవి శాస్త్రి ఈ సమస్యను ఎలా పరిష్కరించాడనే విషయాన్ని తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీం లో రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్.