చిన్నప్పుడు ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఇష్టం.. క్రికెట్ కాదు..!

-

పాన్ సింగ్, దేవకీ దేవీ దంపతులకు ధోనీ జన్మించాడు. తన తండ్రి పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సంపాదించేది అరకొర మాత్రమే. ఆ డబ్బుతోనే రెండు చిన్న గదుల్లో ధోనీ తన చిన్నతనాన్ని వెళ్లదీశాడు.

ఎమ్‌ఎస్ ధోనీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు. ఆయన ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం పూలపాన్పు ఏమీ కాదు. పేద ఇంట్లో పుట్టిన ధోనీ.. చిన్నప్పుడు రెండు గదుల ఇంట్లోనే ఉండేవాడు. తన తండ్రి బీహార్‌లోని ఓ కాలనీలో నీళ్లు వదిలే పంప్ ఆపరేటర్.


చిన్నప్పటి నుంచి ధోనీకి ఆటలంటే ఇష్టం. అయితే.. ధోనీకి క్రికెట్ అంటే ఇష్టం ఉండకపోయేది. అతడికి ఫుట్‌బాల్ అంటేనే ఇష్టం. స్కూల్‌లో ఫుట్‌బాల్ టీంకు గోల్ కీపర్‌గా బాగా ఆడేవాడు. కీపింగ్ బాగా చేసేవాడు. అది చూసిన స్కూల్ కోచ్.. స్కూల్ క్రికెట్ జట్టులో స్థానం ఇస్తాడు.

పాన్ సింగ్, దేవకీ దేవీ దంపతులకు ధోనీ జన్మించాడు. తన తండ్రి పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సంపాదించేది అరకొర మాత్రమే. ఆ డబ్బుతోనే రెండు చిన్న గదుల్లో ధోనీ తన చిన్నతనాన్ని వెళ్లదీశాడు. ధోనీకి ఫుట్‌బాల్‌తో పాటు పెయింటర్ కూడా కావాలని ఉండేదట. కాకపోతే ఆ కల నెరవేరలేదు. కాకపోతే.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ధోనీ మళ్లీ పెయింటర్‌గా ప్రయత్నిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news