ASIA CUP 2022 : ఆసియా కప్ లో భాగంగా మొన్న హాంకాంగ్ మరియు పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రసవత్తర మ్యాచ్ లో పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో సూపర్ 4 కు దూసుకెళ్లింది పాక్. ఈ విజయంతో.. ఇవాళ.. సూపర్ 4 లో భాగంగా టీమిండియాతో పాక్ మరోసారి తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా… దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
ఇండియా : రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (డబ్ల్యుకె), దీపక్ హుడా/అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (WK), బాబర్ ఆజం (c), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ