ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ప్లేయర్లు అందరూ తమ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే IPL ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందింది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ నుంచి కొన్నాళ్లపాటు సోనీ మ్యాక్స్ టీవీ ఛానల్ లో ప్రసారం చేశారు.
ఇక స్టార్ స్పోర్ట్స్, ప్రసార హక్కుల్ని దక్కించుకున్న తర్వాత స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో పలు భాషల్లో మ్యాచుల్ని ప్రచారం చేస్తూ వచ్చారు. మొబైల్ వ్యూవర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాచులు స్ట్రీమింగ్ అయ్యేవి. అయితే 2023-27 సీజన్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని మాత్రం రిలయన్స్ కి చెందిన వయకామ్ 18 సంస్థ, రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగబోయే సీజన్ కోసం కొత్తగా ఓ యాప్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.