Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ గోల్డ్ మెడల్

-

శనివారం ఫిన్‌ లాండ్‌ లోని కుర్టానే గేమ్స్‌ లో ఇండియన్‌ ప్లేయర్‌ దమ్ము చూపించాడు నీరజ్‌ చోప్రా. తన మొదటి ప్రయత్నంలోనే 86.69 మీటర్ల త్రో నమోదు చేసి.. బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. నీరజ్‌ ట్రినిడాడ్‌ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్‌, గ్రెనడాకు చెందిన ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ ను దాటుకని మొదటి స్థానాన్ని చేరుకున్నాడు.

ఇటీవలే కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన చోప్రా, తన 86.69 మీటర్ల త్రో తో అందరినీ ఆశ్చర్య పరిచాడు. అలాగే.. తన ప్రతర్థులు కూడా నీజర్‌ చోప్రా త్రోయింగ్‌ ఫిదా అవుతున్నారు. అయితే.. ఈ గేమ్‌ లో నీరజ్‌ రెండు ఫౌల్‌ త్రోలు చేశాడు. చివరి మూడు త్రోల తర్వాత వైదొలిగాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ నీరజ్‌ అథ్లెటిక్స్‌ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్‌ చేసుకున్నాడు. నీరజ్‌ తర్వాత వాల్‌ కాట్‌ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news