దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాట పర్వం.. ఈ సినిమా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 17వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లోకి రావడం జరిగింది. ఈ సినిమా పైన సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాలో ఏముంది ఎందుకు ఇంత ఆలస్యం అయింది అనే విషయంపై సర్వత్రా చర్చనీయాంశంగా నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సాయి పల్లవి నటించడంతో మరింత పాజిటివ్ టాక్ ఏర్పడిందని చెప్పవచ్చు.ఇక నటన పరంగా సాయి పల్లవి ఇందులో వెన్నెల పాత్ర లో ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో నటించిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఈ సినిమాతో మరో అవార్డు రావడం గ్యారంటీ అని ఆమె అభిమానులు సైతం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఓటీటి దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా హక్కులను రూ.15 కోట్ల రూపాయలు పెట్టి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా రైట్స్ ,శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తంలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. సినిమా తెలంగాణలోని 1990 లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి నక్సలిజం బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించడం జరిగింది. మరి ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లను రాబడుతోంది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.