యూజర్లకు జియో సర్ ప్రైజ్ ‘ సిక్సర్’… ఉచితంగా క్రికెట్ మ్యాచ్‌లు..!

-

జియో యుజర్లందరికి హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం. జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్‌స్టార్‌కు రీడైరెక్ట్ అవుతుంది.

JIO SURPRISES WITH YET ANOTHER ‘SIXER’ DURING THE WORLD CUP

రిలయన్స్ జియో యూజర్లకి శుభవార్త. రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సారి ఇది క్రికెట్ అభిమానుల కోసం. అదేంటంటే… ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచులు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ డేటా రూ.251 రీఛార్జి చేసుకుంటే చాలు. వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా చూసేయవచ్చు. దీనితో పాటు జియో యూజర్లు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుండి హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది.

ఇక డేటా రీఛార్జి విషయానికి వస్తే… రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జి చేసుకుంటే 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలు నిర్వహిస్తుంది. అందులో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. చేసేయండి జియో సిక్సర్ రీచార్జ్… చూసేయండి వరల్డ్ కప్ మ్యాచులు.. మీ అరచేతిలోనే.

Read more RELATED
Recommended to you

Latest news