Mahela Jayawardene neither applied nor approached to be India’s next head coach: శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేను టీం ఇండియా హెడ్ కోచ్ గా నియమించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో బీసీసీఐ చర్చలు జరిపినట్లు సమాచారం.
మరోవైపు గౌతమ్ గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ కూడా కోచ్ రేసులో ఉన్నారు. కాబట్టి t20 wc వరకు రాహుల్ ద్రవీడ్ బాధ్యతలు నిర్వర్తించమన్నారు. ఆ లోగా కొత్త కోచ్ ను నియమించాలని బీసీసీఐ తీవ్రంగా శ్రమిస్తుంది.
కాగా టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిస్తుండడంతో ఆ తర్వాత ఈ స్థానం ఖాళీ అవుతుంది. దీంతో బీసీసీఐ ఇప్పటికే తదుపరి ప్రధాన కోచ్ కోసం అన్వేషణను ప్రారంభించింది.