తెలంగాణ పేదలకు అలర్ట్‌…త్వరలో కొత్త రూపంలో రేషన్ కార్డుల జారీ?

-

తెలంగాణ పేదలకు అలర్ట్‌…త్వరలో కొత్త రూపంలో రేషన్ కార్డుల జారీ కానున్నాయట. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మారనున్నట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Good news for Telangana ration card holders

ఎన్నికల కోడ్ ముగిశాక కార్డులు ఎలా ఉండాలని దానిపై చర్చించనున్నారట. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు చిన్న పుస్తకంలో ఉండేవి. ఆ తర్వాత పాస్ బుక్ సైజులో జారీ చేశారు. తర్వాత వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇక అటు ఇటీవలే కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించింది. రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని, అది నిరంతరం ప్రక్రియ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news