తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ప్రకటించాడు. రెండున్నర ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మారిపోయాయని.. ఆస్తులు, విల్లాలు ఇచ్చే వారికే టికెట్లు ఇస్తున్నారని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన పొన్నాల కంటతడి పెట్టడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే పొన్నాల బీఆర్ఎస్ చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగా బీఆర్ఎస్ లో చేరనున్నారు పొన్నాల. మరికొద్ది సేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సినీయర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను కలవనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కేటీఆర్ వెంట పొన్నాల ఇంటికి వెళ్లనున్నారు. పలువురు పార్టీ సినీయర్ నాయకులు. మరోవైపు పొన్నాల బీఆర్ఎస్ లో చేరితే ఆయనకు జనగామ టికెట్ ఇస్తారా..? లేక పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. నిన్న మొన్నటి వరకు జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వనున్నట్టు తెలిసిందే. కచ్చితంగా జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే ఇవ్వనున్నట్టు సమాచారం. పొన్నాలకు ఏదైనా పదవీ కట్టబెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.