ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అందరిని షాక్ కు గురిచేసింది. ముంబై నిర్ణయాన్ని హిట్ మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ టాస్ టైం లో రోహిత్ ను కెప్టెన్ గా చూడలేమంటూ ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. “గుండె రాయి చేసుకోక తప్పేలా లేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ జెర్సీ లను తగలబెడుతున్నారు ఫ్యాన్స్. ShameonMI అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ట్విట్టర్ లో 4 లక్షల మంది ఫాలోవర్లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది.