Mumbai Police Arrests Hardik Pandya’s Step Brother: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. హార్దిక్ పాండ్య సోదరుడు అరెస్ట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా సవతి తల్లి కొడుకు వైభవ్ పాండ్యా అరెస్టయ్యాడు. వైభవ్ తన సోదరుడు… క్రికెటర్ కృనాల్ పాండ్యా కలిసి 2021 సంవత్సరంలో ఓ బిజినెస్ పెట్టారు.

అందులో వైభవ్ కు 20 శాతం వాట ఉంది. కాదా అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టాడు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి 4.3 కోట్ల రూపాయలను మళ్లించాడట. చీటింగ్ అలాగే ఫోర్జరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలోనే అతన్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.