గత కొద్ది సంవత్సరాలుగా స్టార్ ప్లేయర్ కే.ఎల్.రాహుల్ ఫామ్ లో లేకపోవడంతో అతను విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా-ఏ తో జరుగుతున్న అనధికార రెండో టెస్ట్ లో అతడు విఫలం చెందుతున్నాడు. వరుస ఇన్నింగ్స్ లలో అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. ఇటీవల ఐపీఎల్ లో అతన్ని పంజాబ్ జట్టు వదిలేసుకుంది. రాహుల్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐపీఎల్ లో సత్తా చాటి భారత టీ-20 జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు కే.ఎల్. రాహుల్. “నేను మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. నాకు ఎక్కడ ఫ్రీడమ్ దొరుకుతుందో ఆ జట్టుకు ఆడాలనుకుంటున్ననా. ప్లేయర్ గా ప్రస్తుతం నా స్థానం ఏంటో తెలుసు. ఎలా జట్టులో చోటు సంపాదించాలో కూడా తెలుసు. వచ్చే ఐపీఎల్ లో సీజన్ కోసం ఎదురు చూస్తున్నా” అని ఐపీఎల్ 2025 గురించి వెల్లడించారు.